గాలివాన బీభత్సం.. వడగండ్ల వానతో విలయం!

గాలివాన బీభత్సం.. వడగండ్ల వానతో విలయం!

NRML: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి అకస్మాత్తుగా వాతావారణం మారిపోయింది. ఈ క్రమంలో ఈదురుగాలులు వీచి, సుమారు అరగంట పాటు గాలివానతో పాటు వడగండ్ల వాన పడింది. ఉరుములు, మెరుపుల ధాటికి పట్టణమంతా అల్లకల్లోలమైంది. అప్పటివరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృతి వైపరీత్యంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.