మూడు రోజులు మీసేవ సేవలు నిలిపివేత
MLG: సర్వర్ అప్‌డేట్ కారణంగా ములుగు జిల్లాలో ఈనెల 3 నుంచి 5 వరకు మీసేవ సేవలు నిలిపివేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి సతీష్ తెలిపారు. ఈ రోజులలో ప్రజలు మీసేవ కేంద్రాలకు రావొద్దని సూచించారు. ఈనెల 1 నుంచి సేవల చార్జీలు పెరిగినట్లు వెల్లడించారు. గతంలో ధరలు పెరగలేదని గుర్తు చేశారు. ఈనెల 6 నుంచి సేవలు తిరిగి అందుబాటులో ఉంటాయన్నారు.