VIDEO: మందగిరి శనీశ్వరునికి తైలాభిషేకం పూజలు
KDP: సిద్ధవటంలోని కనుమలోపల్లెలో వెలసిన శ్రీ మందగిరి శనీశ్వరుని స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు ఉదయం గణపతి పూజ, పుణ్యాహ కవచనం, తైలాభిషేకం పూజలు చేశారు. కాగా, కార్తిక శనివారం శనీశ్వరునికి పూజలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం, అందుకోసం భక్తులు తైలాభిషేకం పూజలు చేశారు.