రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
విశాఖ మధురవాడ సమీపంలోని యండాడ లా కాలేజ్ రోడ్ జంక్షన్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన డొడ్డి తులసిరామ్ (42) మధురవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు గాయత్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.