కరెంట్ షాక్‌తో డ్రైవర్లు మృతి

NLR: కరెంట్ షాక్‌తో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. ఈ సంఘటన విడలూరు మండలం ముదివర్తి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రొయ్య పిల్లల లోడుతో రెండు కంటైనర్ లారీలు పాండిచ్చేరి గోల్డెన్ సీడ్ కంపెనీ నుంచి వచ్చాయి. పార్క్ చేస్తున్న సమయంలో లారీకి 11కేవీ కరెంట్ వైరు తగిలి డ్రైవర్ మృతిచెందాడు. అతని కాపాడే ప్రయత్నంలో మరో డ్రైవర్ మృతి చెందాడు