రూ.9 వేల లాటరీ.. రూ.9 కోట్ల పెయింటింగ్ సొంతం!
పికాసో గీసిన అరుదైన పెయింటింగ్‌ను పారిస్‌కు చెందిన ఓ ఇంజినీర్ రూ.9 వేల లాటరీ టికెట్‌తో సొంతం చేసుకున్నారు. ఈ పెయింటింగ్ విలువ రూ.9.1 కోట్లు(మిలియన్ యూరోలు). అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు సాయం చేయడానికి ఒక సంస్థ నిర్వహించిన ఈ లాటరీలో విజేతగా నిలిచారు. 1941లో రూపొందిన ఈ కళాఖండం పేరు 'నేచర్ మోర్టే'. తక్కువ డబ్బుకే రూ.కోట్ల విలువైన పెయింటింగ్ దక్కించుకోవడం గమనార్హం.