త్రివిధ దళాలకు సెల్యూట్ : ప్రభుత్వ సలహాదారు

NZB: ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత త్రివిధదళాలకు ప్రతిఒక్కరూ సెల్యూట్ చేయాలని సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. బుధవారం రాత్రి NZBలోని పులాంగ్ చౌరస్తాలో పహల్గాం ముష్కరుల దాడుల్లో మరణించిన వారికి సంతాపంగా వారికి నివాళి అర్పించారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన జవాన్లకు సెల్యూట్ చేశారు.