కీబోర్డు కన్నా పెన్ను మిన్న
విద్యార్థులు ల్యాప్‌టాప్‌లో టైపింగ్ చేయడం కన్నా, పెన్ను చేతపట్టుకొని నోట్స్ రాసుకోవడం ద్వారానే పాఠ్యాంశాలను బాగా నేర్చుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేతితో రాస్తున్నప్పుడు ఏకాగ్రతతో పాటు రాస్తున్న అంశాన్ని మెదడు లోతుగా విశ్లేషిస్తూ నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ప్రతి ఒక్కరు చేతిరాతను ఎంచుకోవడం ఉత్తమం.