104, 108 వాహనాలకు కొత్త రూపు

W.G: వైసీపీ హయాంలో మరమ్మతులతో రోగులను తరలించే సమయంలో మధ్యలోనే ఆగిపోయిన 104,108 అత్యవసర సేవల వాహనాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్దింది. జిల్లాలో 21 వాహనాలతో పాటు తణుకులో చిన్న పిల్లల కోసం అదనంగా ఒకటి అందుబాటులో ఉంది. మరో 9 వాహనాలు త్వరలో రానున్నాయని 108 పర్యవేక్షకుడు M.రామకృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుతం 34 వాహనాలు వినియోగంలో ఉన్నాయన్నారు.