'అవయవాలు దానం చేయడం అభినందనీయం'

'అవయవాలు దానం చేయడం అభినందనీయం'

NZB: చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బుర్ర రాజేష్ గౌడ్ మరణానంతరం అవయవాలు దానం చేశారు. శనివారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే అభినందించారు. రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానని భరోసా కల్పించారు.