సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో భారీ పేలుడు
WNP: చివ్వేంల మండలం బీబీగూడెంలోని బాలాజీ సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. అధిక వత్తిడితో హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో విడి భాగాలు 500 మీటర్ల దూరం వరకు ఎగిరిపోయాయి. ఆ సమయంలో ప్లాంట్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఆకస్మిక పేలుడుతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.