'అన్నదాత సుఖీభవ' చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడలో 'అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్' పథకం రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో బుధవారం ఘనంగా జరిగింది. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని 11,168 మంది రైతులకు రూ.7.44 కోట్ల విలువైన చెక్కును కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలతో రాష్ట్రం పచ్చగా ఉందని తెలిపారు.