'బీజేపీ పోరాటంతోనే తహసీల్దార్ నియామకం'

'బీజేపీ పోరాటంతోనే తహసీల్దార్ నియామకం'

PDPL: బీజేపీ పోరాటం ఫలితంగానే రామగుండం మండలానికి నూతన తహసీల్దార్ నియామకం జరిగిందని నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. ఇవాళ ఆమె ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ముందుంటుందని పేర్కొన్నారు.