గుండెపోటుతో నిడిగొండ ఉపసర్పంచ్ మృతి

గుండెపోటుతో నిడిగొండ ఉపసర్పంచ్ మృతి

JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ ఉపసర్పంచ్ గంగిడి లక్ష్మారెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గ్రామ ప్రజలతో కలుపుగోలుగా ఉండే ఆయన ఆకస్మిక మరణాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పలువురు నేతలు మృతదేహం వద్ద నివాళులర్పించి సంతాపం తెలిపారు.