బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన

SRD: ప్రధాని మోదీ తల్లిని అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడాలని ఆరోపిస్తూ సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తల్లికి రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.