వైసీపీ నుంచి వైదొలిగిన మండల అధ్యక్షుడు
AKP: కోటవురట్ల మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండల వైసీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కిలాడ శ్రీనివాసరావు మంగళవారం ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పాటు రాజకీయ పరిణామాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించినట్లు వెల్లడించారు.