విశాఖలో వైసీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ
విశాఖ: జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె. రాజు ఆధ్వర్యంలో బుధవారం ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. గురుద్వార్ జంక్షన్ నుంచి సీతమ్మదార తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. విద్యను వ్యాపారం చేయ్యొద్దంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.