నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
MDK: పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుంచి ఏడుపాయలకు వెళ్లే దారిలో ఆదివారం మంజీరా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన కోటేశ్వరరావు మంజీరా నదిలో స్నానానికి వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అప్పటినుంచి పోలీసులు గాలించినప్పటికీ జాడ దొరకలేదు. కానీ మంగళవారం మంజీరా నీటి ప్రవాహం తగ్గడంతో బండ రాళ్ల మధ్యలో మృతదేహం లభించింది.