'ఏయూ హాస్టల్ మెస్‌లు మూసివేయలేదు'

'ఏయూ హాస్టల్ మెస్‌లు మూసివేయలేదు'

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హాస్టల్ మెస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు స్పష్టం చేశారు. మెస్‌లు మూసివేశారనే వార్తలు అవాస్తవమన్నారు. సెలవుల అనంతరం హాస్టళ్లు, మెస్‌లు పూర్తిగా అందుబాటులోకి తెచ్చామని, విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.