మద్యం షాప్ ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

మద్యం షాప్ ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: జిల్లాలో ఓపెన్ కేటగిరిలో ఉన్న 8 మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎక్సేంజ్ అధికారి రామ్మోహన్ రెడ్డి మంగళవారం మీడియాకు తెలిపారు. తాడిపత్రికి -3, కళ్యాణదుర్గానికి-1, గుత్తి రూరల్‌కి -2, పామిడికి-1, పెద్దవడుగూరుకి-1 చొప్పున మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.