మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు.. పట్టుకున్న స్థానికులు
కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ల నుండి పశువుల్లంక గురువారం బైక్‌పై వెళుతున్న దంపతులను ఇద్దరు ఆగంతకులు వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. స్థానికులు వారిని వెంబడించి సలాదివారిపాలెం లంకలో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.