వేములవాడలో 5వ రోజు వైభవంగా పూజలు
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఐదవ రోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రామనామ స్మరణతో మార్మోగింది.