పేకాట శిబిరంపై పోలీసుల దాడి
VSP: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పేకాట శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో నలుగురు పేకాటరాయుళ్లును అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 25,100 స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని పీఎం పాలెం పోలీసులు తెలిపారు. పేకాట శిబిరాలపై సమాచారం పోలీసులకు తెలపాలని సీఐ బాలకృష్ణ అన్నారు.