5 నుంచి మండలంలో ఆధార్ క్యాంపులు

5 నుంచి మండలంలో ఆధార్ క్యాంపులు

NLR: తోటపల్లి గూడూరు మండలంలోని పలు ప్రాంతాల్లో మే 5వ తేదీ నుండి ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలియజేశారు. 5న వరిగొండ సచివాలయం, 6న కోడూరు సచివాలయం, 7,8 తేదీల్లో మాచర్ల వారి పాలెం సచివాలయం తదితర ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆధార్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.