రజినీ, కమల్ కాంబోలో మల్టీస్టారర్?

తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించనున్నారట. వారి క్రేజ్‌కి తగ్గట్టుగా లోకేష్ కథను సిద్ధం చేశారని, దీనికి కమల్, రజినీ ఓకే చెప్పారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాను కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్నట్లు సమాచారం.