రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NZB: ఇందల్వాయి మండలంలోని రైల్వే గేటు (కె.ఎం.నం. 482/16) వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి మంగళవారం తెలిపారు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్న అతడు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు కోటగిరి మండలం రాయకూరుకు చెందిన నీరడి సురేష్ (42)గా ఫోన్ ఆధారంగా గుర్తించారు.