డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
ప్రకాశం: ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం ఒంగోలు 2 టౌన్ పోలీస్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి విద్యార్థులు, యువతకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో “జన చైతన్య జీపు యాత్ర” భాగంగా కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు.