గంగాళమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

KMM: ముదిగొండ మండలం పెద్ద మండువ గ్రామంలో గంగాళమ్మ ఆలయ నిర్మాణ పనులకు సోమవారం డీప్యూటి సీఎం భట్టి సతీమణి నందిని విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.