గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

MHBD: బయ్యారం మండల కేంద్రంలో నేడు 10 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. మండల కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సంతోష్ నాయక్, అర్జున్ దాసులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి లభించినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.