1575 కేజీల గంజాయి దహనం

BHNG: రైల్వే పోలీసులు జిఆర్పి సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రూ .4 కోట్ల విలువలు 1575 కిలోల గంజాయిని దగ్ధం చేశామని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్ చందనా దీప్తి అన్నారు. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలోని రోమా ఇండస్ట్రీస్ బయో మెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ కంపెనీలో గంజాయిని రైల్వే డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ సమక్షంలో దహనం చేశారు.