పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకోవాలి: ప్రిన్సిపల్
MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పుస్తక ప్రదర్శనను ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని, నిత్య జీవితంలో ఇది భాగం కావాలని సూచించారు. పుస్తకాలు చదవడం ద్వారానే అపారమైన జ్ఞానం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.