సౌమ్యనాథస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
అన్నమయ్య: జిల్లాలో చారిత్రాత్మక దేవాలయమైన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి హుండీ ఆదాయం ద్వారా రూ.1,98,200 సమకూరినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. 20 రోజులకు సంబంధించిన భక్తుల కానుకలను మంగళవారం లెక్కించినట్లు చెప్పారు. వచ్చిన మొత్తాన్ని అలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి మల్లికార్జున పాల్గొన్నారు.