మహిళ బంగారు ఆభరణాలు మాయం

మహిళ బంగారు ఆభరణాలు మాయం

ASF: కాగజ్‌‌నగర్ బస్టాండ్‌లో సోమవారం చోరీ జరిగినట్లు సీఐ శంకరయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు కొత్తగూడెం బస్టాప్ వద్ద బస్సు ఎక్కిన ప్రయాణికురాలు సుజాత కాగజ్‌నగర్ చేరుకున్నారు. బస్టాండులో దిగి తన బ్యాగును చూడగా అందులో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.