రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
CTR: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సింగిల్ విండో ఛైర్మన్ రమణ తెలిపారు. పుంగనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో డీసీసీబీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాధా రాణి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతులకు పంట రుణాలు ఇస్తామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 12% వడ్డీతో లోన్లు ఇస్తామని వెల్లడించారు.