VIDEO: నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే నిరసన
AKP: నర్సీపట్నంలో మరిడమ్మ పండుగ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక దళిత వ్యక్తిపై చెయ్యి చేసుకోవడం నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మీద పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.