అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
KDP: మండలంలోని కొత్తమాధవరం, జాంబవంతుని వీధిలో భారీగా అక్రమ రేషన్ బియ్యం మెరుపుదాడి చేసి పట్టుకున్నట్లు కడప విజిలెన్స్ CI శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పక్కా సమాచారంతో ఓ ఇంటిలో దాచిన 142 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని, తరలిస్తున్న ఆటోను ఒంటిమిట్ట CSDTతో కలిసి తాము దాడులు చేసి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రేషన్ బియ్యం వ్యాపారిపై కేసు నమోదు బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.