రేపు మిర్యాలగూడలో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం
NLG: మిర్యాలగూడ పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మాడుగులపల్లి మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మాజీ MLA భాస్కర్ రావు హాజరుకానున్నారు. మండలంలోని అన్ని గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని పార్టీ కార్యాలయం వర్గాలు తెలిపాయి.