చిట్టడవులను తలపించేలా ప్రభుత్వ కార్యాలయాల దుస్థితి
NTR: తిరువూరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పిచ్చిమొక్కలు, తుప్పలతో చిట్టడవులను తలపించే పరిస్థితిలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు వీడియో రూపంలో వెలుగులోకి తీసుకువచ్చారు. కార్యాలయాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.