మహిళా సంఘ భవనానికి భూమిపూజ
KNR: సైదాపూర్ మండలం ఆరెపల్లిలో నూతన మహిళా సంఘ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఈజీఎస్ ద్వారా మంజూరైన రూ. 10 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ పనులకు సర్పంచ్ వర్నె లావణ్య ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో భూక్యా యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు.