మిర్యాలగూడకు చేరుకున్న సైకిల్ యాత్ర

NLG: విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సంఘర్షణ సైకిల్ యాత్ర మంగళవారం సాయంత్రం మిర్యాలగూడకు చేరుకుంది. పట్టణంలోని సుందరయ్య చౌరస్తా వద్ద సైకిల్ యాత్రను సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, ఐద్వా, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పోలేబోయిన వరలక్ష్మి, రవి నాయక్ స్వాగతం పలికారు.