నీల వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

నీల వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం శ్రీ సిద్ధి వినాయక ఆలయం బ్రహ్మోత్సవాల్లో బుధవారం స్వామివారు నీల వర్ణంలో దివ్య దర్శనమిచ్చారు. ఆలయ వార్షిక, బ్రహ్మోత్సవాల్లో ఇవాళ 8వ రోజు సందర్భంగా స్వామికి విశేష రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి, నైవేద్యం సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.