ఒక్క మార్కుతో ఫెయిల్.. ఇంటి నుంచి పరార్..!

ఒక్క మార్కుతో ఫెయిల్.. ఇంటి నుంచి పరార్..!

NZB: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థి ఇంటిని వదిలి వెళ్లిపోయిన ఘటన నందిపేట్ (M) కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అరవింద్ అనే విద్యార్థి ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న వెలువడ్డ ఫలితాల్లో మ్యాథ్స్‌లో ఒక్క మార్కుతో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది ఇళ్లు వదిలి పారిపోయాడు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.