'బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు'
SRD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్థంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి ఇవాళ కలెక్టర్ ప్రావీణ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గౌడ సంఘం జిల్లా సభ్యులు పాల్గొన్నారు.