చిన్నారుల మృతి బాధాకరం

చిన్నారుల మృతి బాధాకరం

KRNL: ఆస్పరి మం. చిగిలి గ్రామంలో 6గురు చిన్నారుల మృతి బాధాకరమని జై భీమ్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కెం జానయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం చిగిలి గ్రామంలో ప్రమాదానికి కారణమైన నీటికుంటను జై భీమ్ ఎమ్మార్పీఎస్ బృందం పరిశీలించారు. కాగా, మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అనంతరం గ్రామంలో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు నిలపాలన్నారు.