సమ్మె విరమణతో కదిలిన బస్సులు
VKB: సమ్మె విరమణతో ఆర్టీసీ బస్సులు ఉదయం నుంచే బయలుదేరి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి వికారాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ఉద్యోగులంతా బస్సులను తీసుకుని బయలుదేరి వెళ్లారు. 3 రోజులుగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ప్రజారవాణా స్తంభించిపోయింది. బస్సులు మళ్లీ రోడ్లపైకి రావడంతో ప్రయాణికులు రవాణా సౌకర్యం మెరుగుపడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.