పీహెచ్సీని తనిఖీ చేసిన DMHO

పీహెచ్సీని తనిఖీ చేసిన DMHO

KMR: సదాశివనగర్ మండలం ఉత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం DMHO డా.రవీందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఔట్రీచ్ వాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందున ఫార్మసీ గదిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా చేపడుతున్న చర్యలపై మెడికల్ ఆఫీసర్ డా. సాయి కుమార్‌ను అడిగి ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు.