పరిశ్రమల్లో వలస కార్మికులతో సమావేశమైన ఎస్సై సుజాత
E.G: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనపర్తి శిక్షణా ఎస్సై సుజాత అన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పరిశ్రమల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులతో ఆదివారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి వివరాలను తెలుసుకుని రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. కార్మికులగా వచ్చిన వారికీ గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అని ఆరా తీశారు.