అప్పటివరకు మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేస్తాం: నారాయణ
AP: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే 54 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. భూ యజమానులతో మాట్లాడి ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సీతమ్మధారలోని మురికివాడను పరిశీలించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.