వార్డు ఏదో తెలియని అభ్యర్థి.. వర్ధన్నపేటలో వింత ప్రచారం
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ అభ్యర్థి చేసిన తప్పిదం చర్చనీయాంశంగా మారింది. 9వ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థి, ప్రచారంలో ఉపయోగించిన నమూనా బ్యాలెట్ పత్రాల్లో తన పేరును 12వ వార్డు అభ్యర్థిగా ముద్రించుకున్నారు. ఈ బ్యాలెట్లతో ఇంటింటి ప్రచారం శుక్రవారం ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దారి తీసింది.