విద్యార్థులకు సీఐ సూచనలు..

KKD: సామర్లకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో బహుళార్థ అవగాహన సదస్సు జరిగింది. విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు. ఆకతాయిల వేధింపుల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.